తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్దాం : విమలక్క

బహుజన బతుకమ్మను ఉత్సవంలా కాదు ఉద్యమంలా ముందుకు తీసుకెళ్దామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారధి విమలక్క పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని ప్రెస్​క్లబ్​లో అరుణోదయ సమావేశం నిర్వహించారు.

vimalakka Announcement For Bahujana bathukamma
బతుకమ్మను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్దాం : విమలక్క

By

Published : Oct 11, 2020, 9:25 AM IST

Updated : Oct 11, 2020, 9:46 AM IST

సిద్దిపేటలోని ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారధి విమలక్క పాల్గొన్నారు. బహుజన బతుకమ్మను ఉత్సవంలా కాకుండా.. ఉద్యమంలా ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.

బతుకమ్మను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్దాం : విమలక్క

కొవిడ్ వల్ల చనిపోయిన వారికి బహుజన బతుకమ్మ తరపున నివాళులు అర్పించారు. కరోనా వల్ల చితికిపోయిన వలస కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండగలను జనసందోహం లేకుండా భౌతిక దూరం పాటిస్తూ జరుపుకోవాలని కోరారు.

దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యాచార ఘటనలు దుర్మార్గమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్​ చేశారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం.. బ్రతకనిద్దాం అని నినాదాలు చేశారు. ఈ నెల 12న బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరించనున్నట్టు విమలక్క ప్రకటించారు. ఈ నెల 16 నుండి 24 వరకు ప్రతి గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు సుధాకర్, శిరీష, సంధ్య, రాకేష్, స్వామి, రమేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి సూపర్ మార్కెట్

Last Updated : Oct 11, 2020, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details