తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ డబ్బాతో తండ్రీకుమార్తె నిరసన - కోహెడ్​ తహసీల్దార్​ కార్యాలయంలో ఉద్రిక్తత

victims protest with petrole bottle in koheda mro office siddipet district
తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ డబ్బాతో తండ్రీకుమార్తె నిరసన

By

Published : Aug 26, 2020, 10:15 AM IST

Updated : Aug 26, 2020, 12:29 PM IST

10:12 August 26

తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ డబ్బాతో తండ్రీకుమార్తె నిరసన

తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ డబ్బాతో తండ్రీకుమార్తె నిరసన

సిద్దిపేట జిల్లా కోహెడ తహసీల్దార్​ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూమిని వేరే వాళ్ల పేరుమీద అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేశారని ఆరోపిస్తూ చెంచలచెరువులపల్లికి చెందిన తండ్రీకుమార్తెలు భీంరెడ్డి తిరుపతిరెడ్డి, స్వరూప ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ పెట్రోల్​ సీసాలతో తహసీల్దార్​ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు.  

తన తండ్రి తిరుపతి రెడ్డికి చెందిన ఎకరం 30 గుంటల భూమిని 2011లో తన పేరుమీద రిజిస్ట్రేషన్​ చేయించారు. అప్పటి నుంచి మ్యుటేషన్​ చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. ఈ మధ్య తమ తండ్రి పేరును తొలగించి.. ఇతరుల పేరుమీద భూమిని నమోదుచేశారు. తమ పేరుమీదనే రిజిస్ట్రేషన్​ చేస్తామని అధికారులు చెబుతున్నారు కానీ చేయడం లేదు. తమ భూమిలో ఇతరులు సాగుచేస్తున్నారు.. పోలీసులను ఆశ్రయిస్తే వారు సైతం తమను బెదిరిస్తున్నారు. తమకు న్యాయం చేయకుంటే తహసీల్దార్​ కార్యాలయంలోనే బలవన్మరణానికి పాల్పడతాం.  

           -బాధితురాలు స్వరూప

విషయం తెలుసుకున్న.. అధికారులు, పోలీసులు బాధితులకు నచ్చజెప్పారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బాధితులను వెంటబెట్టుకొని.. భూమి వద్దకు తీసుకెళ్లి విచారణ చేపట్టారు రెవెన్యూ అధికారులు.  

ఇవీచూడండి:తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్ క్లబ్: కవిత

Last Updated : Aug 26, 2020, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details