సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లోని సిబ్బందికి వాపోరైజర్లు, స్టీమ్ ఇన్హేలర్లను ఎస్సై చంద్రశేఖర్ అందజేశారు. పోలీస్ కమిషనర్ అందజేసిన శానిటైజర్,మాస్కులు సిబ్బందికి ఇప్పటివరకు ఐదు దఫాలుగా ఇవ్వడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్లో సిబ్బందికి ప్రతిరోజు థర్మల్ స్కానింగ్, పల్స్ రేటును చెక్ చేస్తున్నామని తెలిపారు.
పోలీస్ సిబ్బందికి వాపొరైజర్లు, స్టీమ్ ఇన్హేలర్ల పంపిణీ - సిద్దిపేట జిల్లా తాజా వార్త
కరోనా బారిన పడకుండా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి వాపోరైజర్లు, స్టీమ్ ఇన్హేలర్లను ఎస్సై చంద్రశేఖర్ అందజేశారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ తమ విధులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
పోలీస్ సిబ్బందికి వాపొరైజర్లు, స్టీమ్ ఇన్హేలర్ల పంపిణీ
సిబ్బంది విధి నిర్వహణలో బయట గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించి శానిటైజర్ వెంబడి తీసుకుని వెళ్తున్నారని అక్కడ ప్రజలతో మాట్లాడేటప్పుడు భౌతిక దూరం పాటించాలని సూచించడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు థర్మల్ స్కానింగ్, శానిటైజర్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు.
- ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..