సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమెకు మద్దతుగా గ్రామాల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దౌల్తాబాద్ మండలం గోవిందా పూర్, కోనాయిపల్లి గ్రామాల్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రజలు మద్దతుగా నిలుస్తారని.. అది చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు తెరాసపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రతాపరెడ్డి అన్నారు. ప్రతిపక్షాలకు దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సుజాత లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దుబ్బాకలో ప్రచార హోరు.. తెరాస జోరు - సోలిపేట సుజాత
దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి దౌల్తాబాద్ మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి.. కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
దుబ్బాకలో ప్రచార హోరు.. తెరాస జోరు
ఇవీ చూడండి: స్నేహం మాటున చెరబట్టారు.. కటకటాలపాలయ్యారు