సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు హాజరైన బాలయ్య ఎప్పటిలాగే పనులు చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. తోటి కార్మికులు 108 వాహనానికి ఫోన్‌చేయగా అంబులెన్స్ వచ్చేలోపే బాలయ్య మృతి చెందాడని స్థానికులు తెలిపారు.
ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో కూలీ మృతి - ఉపాధిహామీ కూలీ మృతి
ఉపాధి హామీ పనులకు హాజరైన ఓ కూలీ గుండెపోటు మృతి చెందిన సంఘటన సిద్దిపేట తంగళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో కూలీ మృతి
గ్రామ పంచాయతీ అతని మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ దహన సంస్కారాలకు 5000 రూపాయలను మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇదీ చూడండి :భోపాల్ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్ లీక్లెన్నో..