తెలంగాణ

telangana

ETV Bharat / state

Smriti Irani in Husnabad meeting: కారు తెరాసది.. స్టీరింగ్​ ఎంఐఎంది: స్మృతి ఇరానీ

కరోనా సంక్షోభంలో పేదలను మోదీ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) పేర్కొన్నారు. ప్రధాని ఆవాస్​ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నిర్వహించిన భాజపా బహిరంగ సభకు స్మృతి ఇరానీ హాజరయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర(Praja sangrama yatra) నేటితో ముగిసినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.

Smriti Irani in Husnabad meeting
స్మృతి ఇరానీ

By

Published : Oct 2, 2021, 5:51 PM IST

Updated : Oct 2, 2021, 7:38 PM IST

ఎంఐఎం అంటే తెరాసకు భయమని.. ఆ పార్టీ నేత చెప్పినట్లే సీఎం కేసీఆర్​ నడుచుకుంటారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) ఎద్దేవా చేశారు. మజ్లిస్​కు భయపడే తెరాస ప్రభుత్వం సెప్టెంబరు 17న విమోచన దినోత్సవం నిర్వహించలేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో భాజపాప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర(Praja sangrama yatra) ముగిసినట్లు ఆమె ప్రకటించారు. ఆగష్టు 27న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాదయాత్ర ప్రారంభించగా.. తొలిదశలో 36రోజుల పాటు ఈ యాత్ర సాగింది.

హామీలు ఏమయ్యాయి.?

ఆత్మత్యాగాలతో నిర్మించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ భృతి, రెండుపడకల ఇళ్లు, దళితులకు పట్టాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ప్లాంట్‌తో రాష్ట్ర రైతులకు కేంద్రం ఎంతో మేలు చేస్తోందని వివరించారు. ప్రధాని ఆవాస్‌ యోజన పథకం కింద పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసేది కాదని.. మోదీ ప్రభుత్వం 70 వేల కోట్ల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందని వివరించారు.

ఆత్మ త్యాగాల తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు: స్మృతి ఇరానీ

వారి చేతిలోనే స్టీరింగ్​

నీళ్లు, నిధులు, నియామకాల సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ప్రతి ఒక్కరూ కలగన్నారు. ప్రస్తుతం నీటికోసం పోరాడుతున్నారు. నిధులు కేవలం కేసీఆర్‌ కుటుంబానికే దక్కుతున్నాయి. కొలువులు కేవలం తెరాసకు చాకిరీ చేసేవాళ్లకే దక్కుతున్నాయి. తెలంగాణలో విమోచన దినం జరపుతున్నారా?. ఎందుకు నిర్వహించరంటే తెరాసకు ప్రజలంటే భయం లేదు. వారికి కేవలం ఎంఐఎం అంటేనే భయం. ఎందుకంటే కారు స్టీరింగ్‌ తమ చేతిలోనే ఉందని ఎంఐఎం చెబుతోంది. మజ్లిస్​ అధినేత ఎలా చెబితే కేసీఆర్​ అలా నడుచుకుంటారు. -స్మృతి ఇరానీ, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి

అధికారం భాజపాదే..

కరోనా సంక్షోభంలోనూ దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ ఇచ్చిందని స్మృతి ఇరానీ అన్నారు. ఉచిత రేషన్‌తో పాటు మహిళలకు డబ్బులు ఇచ్చి ఆదుకుందని చెప్పారు. పీఎం ఫసల్‌ బీమా యోజన ద్వారా రైతులకు అండగా నిలిచామని.. ఆయుష్మాన్ భారత్‌ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్నామని వివరించారు. కానీ రాష్ట్రంలో నిరుపేదలకు సీఎం కేసీఆర్​ ఏమైనా సాయం చేశారా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో భాజపా తప్పక అధికారంలోకి వస్తుందని స్మతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమలం వికసిస్తుందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:Revanth reddy comments: 'శ్రీకాంత్‌చారికి నివాళి అర్పించాలంటే కేసీఆర్‌, కేటీఆర్‌ అనుమతి కావాలా'

Last Updated : Oct 2, 2021, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details