తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి - ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మొదట నీళ్లలోకి దిగిన అనిల్ మునిగిపోవడం గమనించి.. అతనిని కాపాడేందుకు కుమార్ నీళ్లలోకి దూకాడు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Two teenagers killed after swimming in Shanigaram project
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

By

Published : Jun 6, 2020, 4:40 PM IST

Updated : Jun 6, 2020, 8:35 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టులోకి ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన అనిల్, మానకొండూరు మండలం రంగంపేటకు చెందిన కుమార్​లుగా స్థానికులు తెలిపారు. శనిగరం గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు వెల్లడించారు.

మొదట నీళ్లలోకి దిగిన అనిల్ మునిగిపోవడం గమనించి.. అతనిని కాపాడేందుకు కుమార్ నీళ్లలోకి దూకాడు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమార్​కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొలుత అనిల్ మృతదేహాన్ని ప్రాజెక్ట్ నుంచి వెలికి తీశారు. గల్లంతైన కుమార్ మృతదేహాన్ని ముమ్ముర గాలింపు చర్యల అనంతరం గుర్తించి బయటకు తీశారు. కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు.

ఇదీ చూడండి:విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా : హైకోర్టు

Last Updated : Jun 6, 2020, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details