సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పనుల వల్ల దుమ్ము, ధూళి, రణగొణ ధ్వనులతో గ్రామస్థులు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు.
తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్ పనులు అడ్డుకున్న గ్రామస్థులు - Tukkapur Land expatriates stopped mallannasagar project works
సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో జరుగుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులను భూనిర్వాసితులు, గ్రామప్రజలు అడ్డుకున్నారు.
తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్ పనులు అడ్డుకున్న గ్రామస్థులు
అన్ని గ్రామాల్లానే తమకు నష్టపరిహారం ఇవ్వాలని... తమకు వెంటనే న్యాయం జరగాలని భూనిర్వాసితులు కోరారు. అంతవరకు పనులు జరగనివ్వమంటూ అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్థులను సర్దిచెప్పగా ఆందోళనను విరమించారు.
ఇవీ చదవండి:"బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించ లేదు"