తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు - సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 32వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే నేడు వంటావార్పు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు

By

Published : Nov 5, 2019, 2:46 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 32వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే ఈ రోజు కార్మికులంతా బస్ డిపో ఎదుట ధర్నాకి దిగారు. అనంతరం దీక్ష శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలో ఉన్న కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు... కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లో హాజరు కావాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమపై ఎలాంటి ఒత్తిడి చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details