సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె నేటితో 50వ రోజుకి చేరుకుంది. అందులో భాగంగానే కార్మికులు ఈ రోజు 'ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకుందాం', 'ప్రైవేటు బస్సు వద్దు - ఆర్టీసీ బస్సు ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేత పట్టుకొని నిరసన దీక్షలో కూర్చున్నారు. 50 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి తమను బేషరతుగా ఉద్యోగాల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.
'ప్రజా రవాణా సంస్థను కాపాడుకుందాం' - సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దీక్షా శిబిరంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దీక్షా శిబిరంలో ఆర్టీసీ కార్మికులంతా 'ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకుందాం' అని నినాదాలు చేస్తూ చేతిలో ప్లకార్డులతో నిరసన దీక్షలో కూర్చున్నారు.
'ప్రజా రవాణా సంస్థను కాపాడుకుందాం'