తమ న్యాయమైన కోరికలు ప్రభుత్వానికి తెలిసేలా శాంతియుతంగా ర్యాలీ చేపడితే... అమానుషంగా కొట్టారని... లాఠీఛార్జీలో గాయపడ్డ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన డ్రైవర్ రవీందర్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. శాంతియుతంగా ట్యాంక్‌బండ్ పైకి వెళ్లి నిరసన తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని రవీందర్ గౌడ్ తెలిపారు. తమ మాట వినకుండానే విచక్షణ రహితంగా చితకబాదారని వాపోయాడు. కిందపడేసి పిడిగుద్దులు, లాఠీలతో కొట్టారని కన్నీరు పెట్టుకున్నారు.
'కిందపడేసి విచక్షణా రహితంగా కొట్టారు...' - TSRTC STRIKE UPDATES
ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కనీసం తాము చెప్పే మాటలు కూడా వినకుండానే లాఠీలతో చితకబాదారని... కిందపడేసి ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

TSRTC EMPLOYEES INJURED IN CHALO TANK BUND LAATI CHARGE
'కిందపడేసి విచక్షణా రహితంగా కొట్టారు...'