సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ కొరియర్ సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో హుస్నాబాద్ పరిధిలోని పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు డిపో మేనేజర్ రజనీకృష్ణ ప్రచార ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ సంస్థ ప్రారంభించిన పార్సిల్, కొరియర్, సరుకు రవాణా సర్వీస్‌లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. కరపత్రాలను పంపిణీ చేశారు.
ఆర్టీసీ కొరియర్, పార్సిల్ సర్వీసులపై హుస్నాబాద్‌లో ప్రచార ర్యాలీ - latest news of siddipeta
ఆర్టీసీ అందిస్తున్న కొరియర్, పార్సిల్ సర్వీసులపై ప్రజలకు అవగాహకల్పించేందుకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రచార ర్యాలీ నిర్వహించారు. హస్నాబాద్ డిపోలో అందుబాటు తెచ్చిన ఈ సర్వీసును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అతి తక్కువ ఖర్చుతో భద్రత ప్రమాణాలతో వేగంగా ప్రజలకు పార్సిల్, కొరియర్, సరుకు రవాణాలను ఆర్టీసీ అందిస్తుందని రజనీకృష్ణ వెల్లడించారు. పార్సిల్, కొరియర్ సర్వీసులతో పాటు అధిక మొత్తంలో బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు లాంటి మొదలగు సరుకులను కూడా ఆర్టీసీ గంటల వ్యవధిలో అతి తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి రవాణా చేసే సదుపాయాన్ని కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో సంస్థ పార్సిల్, కొరియర్, సరుకు రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని, హుస్నాబాద్ బస్ డిపో పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:59 చైనా యాప్‌లపై నిషేధం