TSPSC Group 1 Preliminary Exam 2023 : సిద్దిపేట జిల్లాలో ఇవాళ జరిగిన గ్రూప్1 పరీక్షలో ఎగ్జామ్ ప్రారంభం కాకముందే కేంద్రం నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ అనే అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుగా పరీక్ష హాల్లో కూర్చున్న ప్రశాంత్ ఓఎంఆర్ షీట్‌లో హాల్ టికెట్ నంబర్ తప్పుగా రాశాడు. దీంతో పరీక్ష రాసినా వృథానే అని భావించిన సదరు అభ్యర్థి.. పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో పోలీసులు వెంటనే ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. ఆ తరువాత మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు.
Telangana Group 1 Prelims 2023 : పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రం నుంచి బయటకు.. గ్రూప్-1 అభ్యర్థిపై కేసు - Group 1 candidate arrested in Siddipet district
20:06 June 11
TSPSC group 1 Exam : పరీక్ష ప్రారంభం కాకముందే కేంద్రం నుంచి బయటకు.. గ్రూప్-1 అభ్యర్థి నిర్వాకం
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నేడు ప్రశాంతంగా ముగిసింది. గత అనుభవాల దృష్ట్యా.. అధికారుల కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. కఠిన నిబంధనలను పక్కాగా అమలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద.. 144 సెక్షన్‌ను అమలు చేశారు. పలుచోట్ల పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను నిర్వాహకులు అనుమతించలేదు. సిద్దిపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన 24 మందిని వెనక్కి పంపారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని నిరాకరించారు. ఉదయం పదిన్నరకు పరీక్ష ప్రారంభం కాగా.. 15 నిమిషాల ముందు గేట్లను మూసివేశారు.
పరీక్షకు 61.37 శాతం అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 2 లక్షల 33 వేల 248 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,80,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రాల లీకేజీతో పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే.
Group-1 Prelims Arrangements In Telangana : టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించే ప్రథమిక పరీక్ష ఇవాళ 994 కేంద్రాలలో ప్రశాంతంగా ముగిసింది. ఇది వరకు ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ కమిషన్ పటిష్టమైన ఏర్పాట్లను చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంతర ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడింది. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది గేట్లను మూసి వేశారు. ప్రతి సెంటర్ వద్ద అభ్యర్థులను ఫ్రిస్కింగ్ చేసేందుకు పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు మహిళ అభ్యర్థులను చెక్ చేసేందుకు మహిళ సిబ్బందిని ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లను నియమించారు. అభ్యర్థుల వెంట పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సెల్ ఫోన్లు ఇతర పరికరాలను అనుమతించ లేదు.
ఇవీ చదవండి: