తెలంగాణ

telangana

ETV Bharat / state

నిన్నటి దాకా జై అని.. నేడు నై అంటే ఎట్లా..: హరీశ్​రావు - harish siddipet tour

దుబ్బాక ఉపఎన్నిక పోరులో డిపాజిట్ కోసమే కాంగ్రెస్​ ఆరాటమని మంత్రి హరీశ్​రావు ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు తెరాసలో ఉండి.. కేసీఆర్​కు జై కొట్టి.. నేడు నై అంటే ఎట్లా అంటూ.. కాంగ్రెస్​లో చేరికలపై హరీశ్ వ్యాఖ్యానించారు. ​ సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్​లో.. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకు కొండల్​రెడ్డి సహా సుమారు 50 మంది కార్యకర్తలు హరీశ్​రావు సమక్షంలో తెరాసలో చేరారు.

harish rao comments on congress
నిన్నటి దాకా జై అని.. నేడు నై అంటే ఎట్లా..: హరీశ్​రావు

By

Published : Oct 7, 2020, 5:06 PM IST

దుబ్బాక ఉపఎన్నికల్లో డిపాజిట్ కోసమే కాంగ్రెస్​ పోరాటమని మంత్రి హరీశ్​రావు ఎద్దేవా చేశారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీలు మారడం ఎంత వరకు సమంజసమని హరీశ్​ ప్రశ్నించారు.. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

నిన్నటి దాకా జై అని.. నేడు నై అంటే ఎట్లా..: హరీశ్​రావు

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్​లో.. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకు కొండల్​రెడ్డి సహా సుమారు 50 మంది కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్​తోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​ పాల్గొన్నారు.

తెరాస ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే పేదలకు సక్రమంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు మంత్రి హరీశ్​రావు. ప్రజలంతా తెరాసకే ఓటు వేయాలని కోరారు.

ఇవీచూడండి:కాంగ్రెస్​ గూటికి చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి

ABOUT THE AUTHOR

...view details