తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా వ్యాధి నుంచి కోలుకోవాలని సిద్దిపేట పట్టణంలోని 34 వార్డుల్లో ఉన్న హనుమాన్ దేవాలయాల్లో టీఆర్ఎస్వీ నేతలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆయన త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని ముక్కోటి దేవతల వేడుకున్నామన్నారు.
మంత్రి హరీశ్ కరోనా నుంచి కోలుకోవాలని ప్రత్యేక పూజలు - సిద్దిపేట జిల్లా తాజా వార్త
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు కరోనా బారినపడిన సంగతి విధితమే. అయితే ఆయన త్వరగా వ్యాధి నుంచి కోలుకోవాలని సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్వీ పట్టణశాఖ అధ్యక్షుడు పెర్క బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![మంత్రి హరీశ్ కరోనా నుంచి కోలుకోవాలని ప్రత్యేక పూజలు Trsv leaders held special pujas for the recovery of Health Minister Harish Rao in siddipet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8727178-851-8727178-1599576660107.jpg)
మంత్రి హరీశ్ కరోనా నుంచి కోలుకోవాలంటూ హనుమంతునికి పూజలు
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు ఇరుగంటి రమేశ్, కరోళ్ల సతీష్, రాధారం మధు, టీఆర్ఎస్వీ 9వార్డు అధ్యక్షుడు చందు, మహేశ్, నరేశ్, ప్రశాంత్, రమేశ్ శ్రీను, శేఖర్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్