తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కుటుంబాలకు తెరాస నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ - mirdoddi, Dubbaka mandal deceased families News today

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో ఇటీవలే మృతి చెందిన కుటుంబాలను తెరాస రాష్ట్ర నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి.. నక్క రాజు కుటుంబీకులకు ఆర్థిక సాయం అందజేశారు.

ఆ కుటుంబాలకు తెరాస నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ
ఆ కుటుంబాలకు తెరాస నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

By

Published : Sep 18, 2020, 7:20 AM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన పాపని పెద్ద నర్సాగౌడ్ కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. నర్సాగౌడ్ మృతిపై కుటంబీకులకు సంతాపం తెలిపారు.

ఆ కుటుంబాలకు తెరాస నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

నక్క రాజు కుటుంబానికి పరామర్శ..

దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో చిన్నప్పుడు తల్లిని, తాజాగా తండ్రిని కోల్పోయిన నక్క రాజు కుటుంబాన్ని సైతం చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబీకులు అధైర్యపడొద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో హబ్సీపూర్ మాజీ ఎంపీటీసీ, తెరాస నేతలు రాజిరెడ్డి, సాజిద్ ఉషయ్య గారి రాజిరెడ్డి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఆ కుటుంబాలకు తెరాస నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శ

ఇవీ చూడండి : పోషకాహార మాసంగా.. సెప్టెంబరు నెల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details