ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. రైతుల అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
'ఎన్నికలేవైనా... గెలుపు గులాబీ పార్టీదే' - దుబ్బాకలో తెరాస కార్యకర్తల సమావేశం
ఎన్నికలు ఏవైనా.. గెలిచేది తెరాసనే అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక మున్సిపాలిటీ ఇంఛార్జి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు.

దుబ్బాకలో తెరాస కార్యకర్తల సమావేశం
దుబ్బాకలో తెరాస కార్యకర్తల సమావేశం
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెరాస పార్టీ కార్యకర్తల సమావేశానికి మున్సిపాలిటీ ఇంఛార్జి వేలేటి రాధాకృష్ణ శర్మ హాజరయ్యారు. పురపాలక ఎన్నికల గురించి కార్యకర్తలతో చర్చించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా... గెలిచేది తెరాసనే అని ధీమా వ్యక్తం చేశారు.