సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో గలాబీ పార్టీదే విజయమన్నారు ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి. గత రెండు మూడు వారాల నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ గెలుపొందడానికి క్రియాశీలకంగా పని చేశామన్నారు. ప్రతీ ఒక్కరూ తెరాసకే పట్టం కడతామని చెబుతున్నారని తెలిపారు.
దుబ్బాకలో తెరాస విజయం ఖాయం: ఎన్నారై అశోక్ గౌడ్ - దుబ్బాక ఉప ఎన్నిక
దుబ్బాక ఉపఎన్నికలో తెరాస విజయం సాధించబోతుందని ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. గత రెండు మూడు వారాల నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ గెలుపొందడానికి క్రియాశీలకంగా పని చేశామన్నారు.
దుబ్బాకలో తెరాస విజయం ఖాయం: ఎన్నారై అశోక్ గౌడ్
గులాబీ పార్టీకే ప్రజల మద్దతు ఉంటుందని క్షేత్రస్థాయిలో ప్రచార బృందానికి నాయకత్వం వహిస్తున్న సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శానబోయిన చెప్పారని పేర్కొన్నారు. భాజపా, కాంగ్రెస్ అసత్య ప్రచారాలకు.. ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రచారానికి వచ్చిన ఎన్నారై తెరాస బృందానికి.. సహకరించిన నాయకులు, మంత్రి హరీశ్ రావు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:మెట్రోలో స్మార్ట్ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్