దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామ్‌సాగర్, ముంగిసపల్లి, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖం దిగమింగుకొని ముఖ్యమంత్రి ఆశీస్సులతో తన భర్త ఆశయాలను నెరవేర్చేందుకు సుజాత ముందుకు వచ్చిందన్నారు.
మహిళలను అవమాన పరుస్తున్నారు: పద్మాదేవేందర్ రెడ్డి - మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
ఆడబిడ్డను గౌరవించే సంస్కారం లేని రఘునందన్ రావు గ్రామాల్లోకి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామ్‌సాగర్, ముంగిసపల్లి, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మహిళలను అవమాన పరుస్తున్నారు: పద్మాదేవేందర్ రెడ్డి
సుజాత కంటతడి పెడుతుంటే భాజపా అభ్యర్థి... సుజాత కంటతడిని మిమిక్రీ చేస్తూ మహిళలను అవమానపరుస్తున్నారని అన్నారు. భాజపాకు ఈసారి కూడా డిపాజిట్ రాదని పద్మా దేవేందర్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి:కొనసాగుతున్న బండి సంజయ్ దీక్ష.. పార్టీ శ్రేణుల ఆందోళన