తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక నియోజకవర్గంలో తెరాస ఇంటింటి ప్రచారం - dubbaka by elections latest news

ముఖ్యమంత్రి కేసీఆర్​తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి పేర్కొన్నారు.​ దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి గెలిపించాలంటూ అభ్యర్థించారు.

trs leaders Campaign in Dubbaka constituency
దుబ్బాక నియోజకవర్గంలో తెరాస ఇంటింటి ప్రచారం

By

Published : Oct 18, 2020, 8:58 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి తెరాసకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి పేర్కొన్నారు.​ ఎల్లవేళలా అందుబాటులో ఉండేది తెరాస నాయకులేనని తెలిపారు. భాజపా, కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మొద్దని కోరారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి కావాలంటే తెరాస అభ్యర్థి సుజాతను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపుతో ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి..గచ్చిబౌలిలో మరోసారి భూప్రకంపనలు... బ్లాస్టింగ్​లే కారణమంటున్న స్థానికులు

ABOUT THE AUTHOR

...view details