తెలంగాణ

telangana

ETV Bharat / state

కేఏ పాల్‌ చెంప పగలగొట్టిన తెరాస నేత.. కారణమేంటంటే? - TRS leaders attack video

TRS leaders attack on KA Paul in jakkapur, siddipet district
కేఏ పాల్‌పై చేయిచేసుకున్న తెరాస నాయకులు..

By

Published : May 2, 2022, 5:48 PM IST

Updated : May 2, 2022, 7:05 PM IST

17:44 May 02

పోలీసులతో కేఏ పాల్‌ వాగ్వాదం.. చేయిచేసుకున్న తెరాస నేతలు

కేఏ పాల్‌పై చేయిచేసుకున్న తెరాస నాయకులు..

TRS leaders attack on KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తున్న కేఏ పాల్‌పై తెరాస నేత చేయి చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేఏపాల్‌ పర్యటనకు అనుమతి లేదని.. జిల్లాకు రాకుండా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో విషయం తెలుసుకున్న తెరాస శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కేఏ పాల్ పోలీసులతో మాట్లాడుతుండగానే అక్కడే ఉన్న ఓ తెరాస నేత పాల్ చెంప పగలగొట్టారు. కేఏ పాల్ చెంపపై కొట్టడంతో గందరగోళం నెలకొంది. అక్కడున్న వారు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా.. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు కేఏ పాల్‌ను తన వాహనంలో ఎక్కించి హైదరాబాద్ వైపు తరలించారు.

పోలీసులపై కేఏ పాల్ ఫైర్... ''మీరు ప్రభుత్వ ఉద్యోగులా.. లేక తెరాస కార్యకర్తలా... మీకు తెరాస జీతాలు ఇస్తోందా.. లేదా ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయా...'' అంటూ పోలీసులపై కేఏ పాల్ మండి పడ్డారు.

ఇవీ చూడండి:


Last Updated : May 2, 2022, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details