సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోవిందాపూర్, కోనాయిపల్లి, ఉప్పర్‌పల్లి, గువ్వలేగి గ్రామాల్లో తెరాస అభ్యర్థి సుజాత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు బోనాలు, బతుకమ్మలు, డబ్బు చప్పుళ్లతో వారికి ఘన స్వాగతం పలికారు.
సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న తెరాస ప్రభుత్వానికి మద్దతు పలకాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి సుజాతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, భాజపా నాయకులకు ఓట్లు వేస్తే.. చెత్త బుట్టలో వేసినట్లే అవుతుందని విమర్శించారు.