దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అవకాశం అదృష్టం ఉంటే వస్తుందని కానీ తనకు దురదృష్టంతో వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. నియోజకవర్గంలోని ఆరేపల్లి, లింగారెడ్డిపల్లి, చిన్న మాసాన్ పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
'నాకు ఈ అవకాశం దురదృష్టంతో వచ్చింది'
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తెరాస అభ్యర్థి సుజాత.. ఆరేపల్లి, లింగారెడ్డిపల్లి, చిన్న మాసాన్ పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
'నాకు ఈ అవకాశం దురదృష్టంతో వచ్చింది'
రామలింగారెడ్డి భార్య సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. ప్రజలకు సూచించారు.