తెలంగాణ

telangana

ETV Bharat / state

'అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా' - dubbaka by election update

దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత నిర్వహించిన ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని.. బోనాలు బతుకమ్మలతో స్వాగతం పలుకుతున్నారు.

trs candidate solipet sujatha campaign in rayapolu mandal
trs candidate solipet sujatha campaign in rayapolu mandal

By

Published : Oct 20, 2020, 4:11 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాలలో భాజపా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రభాకర్​రెడ్డి ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు తెరాస వైపు ఉన్నారన్నారని తెలిపారు.

'అందరికి అందుబాటులో ఉండి సేవ చేస్తా'

మధ్యంతర ఎన్నికలు రావటం తన దురదృష్టమని తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదిస్తే... రామలింగారెడ్డి ఆశయాలను నెరవేరుస్తానన్నారు. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి!

ABOUT THE AUTHOR

...view details