దుబ్బాకకు ఉప ఎన్నికలు రావడం దురదృష్టకరమని... ఇంత తొందరగా ఎన్నికలు వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో... దివంగత నేత రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
'రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తా...' - dubbaka election campaign news
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. గ్రామ గ్రామాన ఘన స్వాగతం పలుకుతున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ రోజా శర్మ ప్రచారంలో పాల్గొంటూ మద్దతుగా నిలుస్తున్నారు.
trs candidate solipet sujatha campaign in dubbaka
ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ భావోద్వేగంతో అభ్యర్థి సుజాత ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, భాజపా నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారని.. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు పుట్టెడు దుఖంతో మీ ముందుకు వచ్చిన సుజాతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.