తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2019, 5:29 PM IST

ETV Bharat / state

అమరవీరులకు తెలుగు వెలుగు ఘన నివాళి

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఇప్పటికీ మాయని మచ్చ జలియన్​ వాలాబాగ్ మరణకాండ. ఈ ఉదంతంలో దాదాపు 1000 మంది మరణించారు. ఈ దుర్ఘటన జరిగి నేటితో వందేళ్లు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గౌరవెళ్లిలో తెలుగు వెలుగు సంస్థ ఆధ్వర్యంలో సంస్మరణ సమావేశాన్ని నిర్వహించారు.

జలియన్ వాలాబాగ్ మరణించిన అమరులకు నివాళి

సిద్దిపేట జిల్లా గౌరవెళ్లిలో తెలుగు వెలుగు సంస్థ ఆధ్వర్యంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగి వందేళ్లు అయిన సందర్భంగా సంస్మరణ సమావేశాన్ని నిర్వహించారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్​లోని జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన ప్రజలకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు కీర్తిశేషులు చీకట్ల ముత్తయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సమావేశానికి తెలుగు వెలుగు సంస్థ వ్యవస్థాపకులు నాదమునుల రామారావు, విశ్రాంత ఉపాధ్యాయులు చిట్టి వేణుగోపాల్ రెడ్డి, గౌరవెల్లి సర్పంచ్, స్థానికులు హాజరయ్యారు.

జలియన్ వాలాబాగ్ మరణించిన అమరులకు నివాళి

ఇవీ చూడండి: దిగ్గజాలు లేని పోరులో గెలుపు ఎవరిది?

ABOUT THE AUTHOR

...view details