తెలంగాణ

telangana

ETV Bharat / state

అమర జవానుకు ఘననివాళి అర్పించిన కుటుంబ సభ్యులు - జవానుకు ఘన నివాళి

మందుపాతర పేలిన ఘటనలో 2014లో మృతి చెందిన జవాను నరసింహ నాయక్ ఏడో వర్థంతిని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆయన స్మారకార్థం నిర్మించిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన కుమారుడు ప్రాణత్యాగం చేసి ఏడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం తరఫున తమకు ఎలాంటి సాయం అందలేదని జవాను తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

tribute to the martyred soldier in siddipet district
జవానుకు ఘన నివాళి

By

Published : Apr 9, 2021, 5:17 PM IST

ఛత్తీస్​గఢ్​ మందుపాతర పేలుడు ఘటనలో మరణించిన జవాను నరసింహ నాయక్ ఏడో వర్థంతిని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆయన స్మారకార్థం నిర్మించిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాజు తండాకు చెందిన జవాన్ నరసింహ నాయక్ 2014లో ఛత్తీస్​గఢ్​లో జరిగిన మందుపాతర పేలుడులో మృతి చెందాడు. దేశం కోసం తన కుమారుడు ప్రాణాలు అర్పించి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు తమ కుటుంబానికి ఎలాంటి సహాయం అందలేదని జవాను తండ్రి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పదించి తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.

ఇదీ చదవండి:సంకల్ప సభకు వెళ్తున్న షర్మిలకు చౌటుప్పల్​లో ఘనస్వాగతం

ABOUT THE AUTHOR

...view details