తమకు జీవనాధారమైన వ్యవసాయ భూములను కొంతమంది కబ్జా చేస్తున్నారని... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌడుతండాకు చెందిన గిరిజన రైతులు ఆరోపించారు. భూములకు పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి... వినతిపత్రం సమర్పించారు. తమ పూర్వీకుల నుంచి సేద్యం చేసుకుంటున్న సుమారు 15 ఎకరాల భూమిపై అక్రమ పట్టాలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'మా వ్యవసాయ భూములను కొంతమంది కబ్జా చేస్తున్నారు' - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ వ్యవసాయ భూములను కొంతమంది కబ్జా చేసి, అక్రమ పట్టాలు చేయించుకుంటున్నారని... సిద్దిపేట జిల్లాకు చెందిన గిరిజన రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట అక్కన్నపేట మండలం చౌడుతండా రైతులు ఆందోళన చేపట్టారు.
'మా వ్యవసాయ భూములను కొంతమంది కబ్జా చేస్తున్నారు'
తమ తాతల కాలం నుంచి ఉన్న భూమిని చదును చేసి పంటలు పండించుకుంటూ జీవిస్తున్నామని అన్నారు. ఆ భూములను కబ్జా చేస్తే తాము ఏం పని చేసుకుని బతకాలని కన్నీటి పర్యంతమయ్యారు. గిరిజనుల ఆందోళనకు భాజపా యువ మోర్చా నాయకులు మద్దతు తెలిపారు. రైతులకు న్యాయం చేయకపోతే వారి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: మీ మెదడు పనితీరు మెరుగుపడాలా ? అయితే ఇవి తినాల్సిందే.!