సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు త్వరలోనే రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైలు ఇంజిన్‌తో మనోహరాబాద్-గజ్వేల్ మధ్య రైలు పట్టాలపై సన్నాహక పరుగులు నిర్వహించారు. కొన్నిరోజుల్లో గజ్వేల్‌కు రైలు సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికారులు పనులు ముమ్మరం చేశారు.
త్వరలోనే గజ్వేల్‌కు రైలు సేవలు - siddipet district news
త్వరలోనే గజ్వేల్‌కు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అధికారులు రైలు ఇంజిన్‌తో పట్టాలపై సన్నాహక పరుగులు నిర్వహించారు.
త్వరలోనే గజ్వేల్‌కు రైలు సేవలు
పట్టాల బిగింపు, స్టేషన్ల నిర్మాణంతో పలు దఫాలుగా ఇంజిన్‌తో సన్నాహక పరుగులు నిర్వహించారు. పూర్తిస్థాయి రైలుతో వేగంగా సన్నాహక పరుగులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కుదరకపోవడం వల్ల మరో రెండు రోజుల తర్వాత నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత సేఫ్టీ కమిషన్ తనిఖీ నిర్వహించిన కొన్ని రోజుల్లోనే గజ్వేల్‌కు రైలు సేవలు ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి:'జర్నలిస్టులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి'