తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హుస్నాబాద్​లో ట్రాక్టర్ల ర్యాలీ - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

దిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ రైతు ఐక్యత సంఘం ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

tractor rally at husnabad in siddipeta district
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హుస్నాబాద్​లో ట్రాక్టర్ల ర్యాలీ

By

Published : Jan 27, 2021, 12:49 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. దిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా రైతు ఐక్యత సంఘం ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 67 రోజులకు పైగా చలి, వర్షంలో ఇబ్బందులకు పడుతూ.. రైతులు నిరసన తెలుపుతున్నా కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడాన్ని రైతు సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.

రైతులు దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు రైతుల పక్షాన నిర్ణయం తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా స్థానిక అంబేడ్కర్​ చౌరస్తాలో ఉన్న అంబేడ్కర్​ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

ఇదీ చదవండి:కర్నల్ సంతోష్​బాబు కుటుంబానికి అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details