సిద్దిపేట జిల్లా దుబ్బాక నగర పంచాయతీ కేంద్రంలో రైతుల రుణమాఫీ, సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. ఈ ధర్నాలో రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సంఘం అధ్యక్షుడు కోదండ రెడ్డి, జిల్లా అధ్యకుడు తూంకుంట నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు ఇప్పటివరకు కొద్ది మంది రైతులకు మాత్రమే అందిందని.. అన్నదాతల పంట నష్టం విషయంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి పరిహారం రావడం లేదని కోదండ రెడ్డి మండిపడ్డారు. రైతులందరూ సంఘటితమై తమ సమస్యలపై పోరాడాలని.. కాంగ్రెస్ వారికి అండగా ఉంటుందన్నారు.
రైతు సమస్యలపై సిద్దిపేట జిల్లాలో టీపీసీసీ ధర్నా - రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సంఘం అధ్యక్షుడు కోదండ రెడ్డి
రైతులందరూ సంఘటితమై తమ సమస్యలపై పోరాడాలని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సంఘం అధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. అన్నదాతలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కర్షకుల రుణమాఫీ కోసం టీపీసీసీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

రైతు సమస్యలపై సిద్దిపేట జిల్లాలో టీపీసీసీ ధర్నా
రైతు సమస్యలపై సిద్దిపేట జిల్లాలో టీపీసీసీ ధర్నా
ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ