సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ మేలు చేయకుండా... కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అధికారంలో ఉండి కోట్లలో దోచుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు.
కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: ఉత్తమ్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్తలు
తెలంగాణలో సామాజిక న్యాయం జరగడంలేదని... కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెపుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
'ఆ కుటుంబం అధికారంలో ఉండి... రాష్ట్రాన్ని దోచుకుంటుంది'
2014 నుంచి దుబ్బాకలో తెరాస చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. దుబ్బాక ప్రజలు... ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి చేసిన అభివృద్ధిని పోల్చుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధే కావాలంటూ ప్రజలు చెరుకు శ్రీనివాస్‌రెడ్డినే కచ్చితంగా గెలిపిస్తారని... సర్వే ఫలితాలు ఇవే చెపుతున్నాయని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:దుబ్బాకలో తెరాస గెలుపు ఖాయం.. రెండో స్థానంలో ఎవరుంటారో..: హరీశ్‌రావు