తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2020, 5:09 PM IST

ETV Bharat / state

ఎన్నికల కమిషన్​ చర్యలు తీసుకోవాలి: కోదండరాం

సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన విధానాన్ని తెజస అధ్యక్షుడు కోదండరాం తప్పుబట్టారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ యంత్రాంగ దుర్వినియోగం అవుతోందన్నారు. ఎన్నికల కమిషన్​కు లోబడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల కమిషన్​ చర్యలు తీసుకుని దుబ్బాక ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు.

ఎన్నికల కమిషన్​ చర్యలు తీసుకోవాలి: కోదండరాం
ఎన్నికల కమిషన్​ చర్యలు తీసుకోవాలి: కోదండరాం

సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరును తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కొదండరాం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు లోబడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. అయితే తెలంగాణ వచ్చాక.. ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పారదర్శకంగా వ్యవహరించాల్సిన వ్యవస్థ కేవలం ప్రతిపక్ష పార్టీలపై దాడి చేయడం.. ప్రజలను నియంత్రించడానికి మాత్రమే వినియోగిస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలన్నారు.

ఇదీ చదవండి:దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం.. రణరంగంగా సిద్దిపేట

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details