తెలంగాణ

telangana

ETV Bharat / state

టిప్పర్​ ఢీకొని ఇద్దరు కూలీల మృతి - latest accident news in siddipet district

ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొన్న ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Tipper collides and kills two workers
టిప్పర్​ ఢీకొని ఇద్దరు కూలీల మృతి

By

Published : Jan 24, 2020, 3:00 PM IST

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనం​ ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

కొక్కొండ గ్రామానికి చెందిన స్వామి, కుమార్​లు కూలీ పనుల కోసం మేడ్చల్​కు బయలుదేరారు. బండమైలారం సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

స్వామికి భార్య, కుమారుడు ఉండగా.. కుమార్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద స్థలికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఈ రహదారిపై ఎక్కువ సంఖ్యలో టిప్పర్లు తిరగడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుల బంధువులు, గ్రామస్థులు రహదారిపై ఆందోళనకు దిగారు.

ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై రాజేంద్రప్రసాద్​ వారికి నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

టిప్పర్​ ఢీకొని ఇద్దరు కూలీల మృతి

ఇవీ చూడండి: కరీంనగర్ నగరపాలికలో ప్రశాంతంగా పోలింగ్‌

ABOUT THE AUTHOR

...view details