సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంక్షేమ భవనం కోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చొరవతో మూడు ఎకరాల స్థలం కేటాయించామని ఎంపీ బండ ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో నిర్మించబోయే ముదిరాజ్ సంక్షేమ భవనానికి జనవరి 8న భూమి పూజ చేస్తామని ప్రకటించారు.
'ముదిరాజ్ సంక్షేమ భవనం కోసం మూడు ఎకరాల స్థలం' - mp banda praakash latest news
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చొరవతో ముదిరాజ్ సంక్షేమ భవనం కోసం మూడు ఎకరాల స్థలం కేటాయించామని ఎంపీ బండ ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. ఈ భవనానికి జనవరి 8 న పూజ చేస్తామని ప్రకటించారు. ముదిరాజ్ కులస్థులు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
'ముదిరాజ్ సంక్షేమ భవనం కోసం మూడు ఎకరాల స్థలం'
ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మంత్రి హరీశ్ రావు, ఈటెల రాజేందర్ హాజరవుతారన్నారు. ముదిరాజ్ కులస్థులు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ సంక్షేమం కోసం ఇప్పటికే చాలా మచ్చ సొసైటీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.
ఇదీ చూడండి:'కొత్త' గుబులు: యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్