తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊర చెరువుల కట్టలకు ముప్పు.. ఆందోళనలో అన్నదాతలు - today news oora cheruvu

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని ఊర చెరువు, మండలంలోని మల్లంపల్లి ఊర చెరువు కట్టలకు ముప్పు పొంచి ఉంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో పాటు ఆదివారం రాత్రి కురిసిన వానలకు అక్కన్నపేట చెరువు మత్తడి దూకుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి చెరువులోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో అక్కన్నపేట చెరువు వద్ద మట్టి కుంగింది.

ఊర చెరువు కట్టకు ముప్పు.. ఆందోళనలో అన్నదాతలు
ఊర చెరువు కట్టకు ముప్పు.. ఆందోళనలో అన్నదాతలు

By

Published : Sep 14, 2020, 8:04 PM IST

Updated : Sep 14, 2020, 9:19 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేంద్రంలోని ఊర చెరువు, మండలంలోని మల్లంపల్లి ఊర చెరువు కట్టలకు ముప్పు పొంచి ఉంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు సహా ఆదివారం రాత్రి కురిసిన వానలకు అక్కన్నపేట చెరువు మత్తడి దూకుతోంది. ఈ క్రమంలో భారీ వర్షాలతో మరోసారి చెరువులోకి పెద్ద ఎత్తున నీరు చేరి అక్కన్నపేట చెరువు వద్ద మట్టి కుంగింది.

ఊర చెరువు కట్టకు ముప్పు.. ఆందోళనలో అన్నదాతలు

ఆందోళనలో అన్నదాతలు..

మల్లంపల్లి చెరువు కట్ట వెలుపలి వైపు కూలి కిందికి జారింది. ఇరవై రోజుల క్రితం భారీ వర్షాలు పడినప్పుడు కట్ట కోతకు గురికాగా ట్రాక్టర్లతో మట్టి తెప్పించి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం యథాస్థితికి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమాచారం ఇవ్వగా తాత్కాలిక మరమ్మతులు చేయించారు.

ఊర చెరువు కట్టకు ముప్పు.. ఆందోళనలో అన్నదాతలు

కాంట్రాక్టర్ నాసిరకం పనుల వల్లే..

అక్కన్నపేట చెరువు నీరు బుంగ నుంచి లీకేజీ అవుతూనే ఉంది. ఒకవేళ చెరువు కట్ట తెగితే అంతకపేట జనగాం, తోటపల్లి చెరువులతో పాటు హుస్నాబాద్​లోని ఎల్లమ్మ చెరువుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో మిషన్ కాకతీయ పనుల కింద కోటి 20 లక్షల రూపాయలతో అక్కన్నపేట చెరువుకు మరమ్మతులు చేయించారని, కానీ కాంట్రాక్టర్ నాసిరకం పనులతో చేతులు దులుపుకున్నాడని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.

అన్నదాతల సంతోషం ఆవిరి..

అక్కన్నపేట చెరువు కింద దాదాపు ఆరు వేల ఎకరాల ఆయకట్టు ఉందని, కొన్నాళ్ల తర్వాత ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలతో చెరువు నిండిన సంతోషం ఆవిరైంది. ప్రస్తుతం చెరువుకు ఏర్పడిన లీకేజీ వల్ల నీరు వృథాగా పోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి లీకేజీతో సహా కుంగుతున్న చెరువు కట్టకు శాశ్వతమైన మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి : రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలి: నంది రామయ్య

Last Updated : Sep 14, 2020, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details