సిద్ధిపేట జిల్లా తొగుట మండలం కేంద్రంలో గల పెద్దమ్మ, మల్లన్న ఆలయాలు, లింగంపేటలోని పెద్దమ్మ ఆలయాల తలుపులు, తాళాలు పగలగొట్టి.. ఆలయాల్లోని హుండీల్లోని సొమ్మును దొంగలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న తొగుట ఎస్సై శ్రీనివాసరెడ్డి చోరీ జరిగిన ఆలయాల్లో క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
అర్ధరాత్రి ఆలయాల్లో చోరీ.. హుండీలు దోచుకెళ్లిన దొంగలు - సిద్ధిపేట జిల్లా వార్తలు
అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆలయాల తాళాలు పగలగొట్టి హుండీలు దోచుకెళ్లిన సంఘటన సిద్ధిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అర్ధరాత్రి ఆలయాల్లో చోరీ.. హుండీలు దోచుకెళ్లిన దొంగలు
చోరీకి పాల్పడిన దొంగలు హుండీలను ఆలయం బయట పారేసి వెళ్లారు. సంబంధిత ఆలయా కమిటీల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాల ద్వారా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!