తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్నాబాద్​లో పట్టపగలే ఇల్లు గుల్ల - Theft in House in Husnabad

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడారు. ఇవాళ ఒక్కరోజే రెండు ఇళ్లలో చొరబడి డబ్బులు, నగలను ఎత్తుకెళ్లారు.

హుస్నాబాద్​లో పట్టపగలే ఇల్లు గుల్ల

By

Published : Oct 28, 2019, 11:32 PM IST

హుస్నాబాద్ పట్టణంలో పట్టపగలే రెండు ఇళ్లలో దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడ్డారు. అక్కన్నపేట రోడ్డులోని బాలాజీ నగర్​లో నివాసముండే శైలజ హుస్నాబాద్ డిపోలో కండక్టర్​గా పనిచేస్తుంది. సోమవారం సమ్మెలో పాల్గొనేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లింది. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించిన దొంగలు గేట్ పైనుంచి దూకి లోపలికి వెళ్లారు. ఇంటి తాళన్ని పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. మరో ఘటనలో ఎల్లంబజార్​కు చెందిన బత్తుల బాబు ఇంట్లో సైతం దొంగతనానికి పాల్పడ్డారు. బాబు తన ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లగా... తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఎనిమిది వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని... సిద్దిపేట నుంచి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

హుస్నాబాద్​లో పట్టపగలే ఇల్లు గుల్ల

ABOUT THE AUTHOR

...view details