సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట గ్రామ సర్పంచ్ అనసూయ ఎన్నికల సమయంలో దేవాలయ నిర్మాణానికి హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని కుల బహిష్కరణ చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కులస్తులతో చర్చిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో కుల బహిష్కరణ అనేది మూఢ నమ్మకాలకు, వెనుకబాటుతనానికి నిదర్శనమన్నారు.
చట్టం ముందు, రాజ్యాంగం ముందు అందరూ సమానులేనని అన్నారు. అందరూ కలసికట్టుగా సమస్యను పరిష్కరించుకోవాలని కులస్తులకు అధికారులు హితవు పలికారు. కార్యక్రమంలో దుబ్బాక సిఐ హరికృష్ణ, భూంపల్లి ఎస్సై జమాల్, మిరుదొడ్డి తహసీల్దార్, ఆర్ఐలు పాల్గొన్నారు.
ఆలయం కట్టలేదని... సర్పంచ్ కుల బహిష్కరణ - The temple was not built as per the election oath so the Sarpanch was expelled from caste
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సర్పంచ్ దంపతులను కుల బహిష్కరణ చేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.
సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ కుల బహిష్కరణ
ఇవీ చూడండి : దిశ కేసు: నిందితుల వాడిన లారీలో ఆధారాల సేకరణ
TAGGED:
sarpancha kulabahishkarana