తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆలయం 30 ఏళ్ల క్రితం ఉన్నట్లే ఉంది... అభివృద్ధేమీ లేదు'

సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం నాచారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు ఇప్పటికైనా సమస్యలను గుర్తించి ఆలయంలో వసతులు కల్పించాలని కోరారు.

'ఆలయం 30 ఏళ్ల క్రితం ఉన్నట్లే ఉంది... అభివృద్ధేమీ లేదు'
'ఆలయం 30 ఏళ్ల క్రితం ఉన్నట్లే ఉంది... అభివృద్ధేమీ లేదు'

By

Published : Feb 2, 2020, 7:28 PM IST

Updated : Feb 2, 2020, 9:03 PM IST

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోవట్లేదని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో యాదాద్రిగా చరిత్రకెక్కిన ఈ ఆలయాన్ని పాలకులు పట్టించుకోవడమే మానేశారని వాపోయారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని... ఆలయ సత్రాల్లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనం కోసం ఏడాదికి ఒకసారి ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదంటూ అరుణ జ్యోతి బెస్త ఆందోళన వ్యక్తం చేశారు.

దేవాదాయ శాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ...

ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నందున... అధికారులు ఎందుకు అభివృద్ధి చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా చొరవ తీసుకుని దేవస్థానంలో మౌలిక వసతులను కల్పించాలని కోరుతున్నారు.

'ఆలయం 30 ఏళ్ల క్రితం ఉన్నట్లే ఉంది... అభివృద్ధేమీ లేదు'

ఇదీ చూడండి :వనదేవతల జాతరలో కోయదొరల జోరు

Last Updated : Feb 2, 2020, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details