వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ఉత్తరద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. పాలక మండలి సభ్యులు ఆలయం ముందు భక్తుల కోసం షామియానా, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ నియా ఘటనలు జరగకుండ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనకోసం భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండి పోయింది. వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత వివరిస్తూ ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.. స్వామి వారికి మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు.
భక్తులతో కిటకిటలాడిన సిద్దిపేట ఆలయాలు - తెలంగాణలో వైకుంఠ ఏకాదశి పండుగ
సిద్దిపేటలో శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏకాదశి పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి విశిష్టత వివరిస్తూ ప్రవచనాలు నిర్వహించారు.
భక్తులతో కిటకిటలాడిన సిద్దిపేట ఆలయాలు