కొవిడ్-19 విజృంభిస్తున్న వేళ నిత్యం వీధులను పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటలో ప్రజా ప్రతినిధులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శాసనసభ్యుడు రామలింగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు, ప్రజలకు నిత్యావసరాలను అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే సోలిపేట - పారిశుద్ధ్య కార్మికులు నిత్యావసరాల పంపిణీ
కరోనా ప్రబలుతున్న వేళ అనుక్షణం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటలో పారిశుద్ధ్య కార్మికులకు, ప్రజలకు ఆయన నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే సోలిపేట
విశేష సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని 7 మండలాల్లో రెండు మెదక్ జిల్లాలో ఉన్నాయని... ఈ రెండు మండలాల్లో పరిశ్రమలన్నీ స్థాపితమై ఉన్నాయని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతున్నా... పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోకుండా... మానవతా దృక్పథం లేకుండా పశువు కన్నా హీనంగా ఉంటున్నాయని విమర్శించారు.
ఇదీ చూడండి:-ఆ కరోనా మృతులంతా భోపాల్ దుర్ఘటన బాధితులే