సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నివాసముంటున్న కొత్తకొండ స్వామి అనే వృద్ధుడు తన ఇంటి ఎదుట టెంట్ వేసుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇద్దరు కుమారులు తనను చూసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్తకొండ స్వామి భార్య మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి స్వామి తన వంట తానే చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులకు చెరో రెండు కోట్ల ఆస్తిని పంచి ఇచ్చానని చెప్పారు.
కుమారులు చూసుకోవడం లేదని వృద్ధుడు దీక్ష - సిద్దిపేట జిల్లా లేటెస్ట్ వార్తలు
తన ఇద్దరు కుమారులు పట్టించుకోవడం లేదని ఓ తండ్రి దీక్షకు దిగిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది. తన డిమాండ్లు తీర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.
![కుమారులు చూసుకోవడం లేదని వృద్ధుడు దీక్ష కుమారులు చూసుకోవడం లేదని వృద్ధుడు దీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:10:06:1623591606-tg-krn-103-13-vruddudu-nirahara-diksha-avb-ts10085-13062021185727-1306f-1623590847-92.jpg)
పెద్ద కుమారుడికి అవసరం ఉంటే 10 లక్షల అప్పు తీసుకొచ్చి ఇచ్చానని తెలిపారు. అప్పు కట్టమని పెద్ద కుమారుడిని అడిగితే ఉన్న ఇల్లు తన పేరిట రాసిస్తే కడతానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పారు. పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించిన ప్రకారం తనకు సంవత్సరానికి ఇద్దరు కుమారులు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్ద కుమారుడు పది లక్షల అప్పు తీర్చే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని వృద్ధుడు కొత్తకొండ స్వామి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపాడు.
ఇదీ చదవండి:Ap Corona cases: కొత్తగా 6,770 కరోనా కేసులు, 58 మరణాలు