తెలంగాణ

telangana

ETV Bharat / state

Mission Bhageeratha: త్వరలో మూడోదశ ప్రారంభం.. పూర్తి స్థాయి ఫలాలు అందడమే లక్ష్యం - మిషన్ భగీరథ

Mission Bhageeratha: ప్రతిచోటుకూ శుద్ధి చేసిన నదీ జలాలు. ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత మంచినీరు. ఇవీ మిషన్ భగీరథ ఫలాలు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ఈ ఫలాలన్నీ పూర్తి స్థాయిలో అందేలా మిషన్ భగీరథ శాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో మూడో దశ త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి మిషన్ భగీరథ జలాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కూడా సిద్ధమవుతోంది. గజ్వేల్ సెగ్మెంట్ కోసం నిర్మిస్తున్న నీటిశుద్ధి కేంద్రం, పైప్ లైన్ పనులను కూడా వేగవంతం చేసింది.

Mission Bhageeratha
మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్‌లో మూడో దశ త్వరలో ప్రారంభం

By

Published : Dec 14, 2021, 5:08 AM IST

Mission Bhageeratha: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను మిషన్ భగీరథ పథకం నిలిపింది. రాష్ట్రంలోని మొత్తం 23వేల 890 ఆవాసాలకు గాను 23వేల 775 ఆవాసాలకు శుద్ధి చేసిన నదీ జలాలను సరఫరా చేస్తున్నారు. అడవులు, గుట్టల్లో ఉన్న 115 ఆవాసాలకు సౌరవిద్యుత్ పంపుసెట్ల సహాయంతో మంచినీరు సరఫరా చేస్తున్నారు. దీంతో వంద శాతం ఆవాసాలకు సురక్షిత నదీ జలాలను అందిస్తున్నారు. రాష్ట్రంలోని 54 లక్షల ఆరు వేలా 70 ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. 112 మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ శాఖ ద్వారా శుద్ధిచేసిన నదీజాలలను బల్క్‌గా సరఫరా చేస్తున్నారు.

works in special drive: గడిచిన మూడేళ్లుగా నీటి సరఫరా కొనసాగుతోంది. ఈ సంవత్సరం రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురిశాయి. దీంతో మిషన్ భగీరథకు సంబంధించిన నిర్మాణాలు, పైపులైన్ల స్థితిగతులను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ఫలాలు పూర్తి స్థాయిలో అందాలన్నదే ఈ డ్రైవ్ ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోని ఇంజినీర్లు, అధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మూడు దశల్లో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో ఇప్పటివరకు రెండు విడతలు పూర్తయ్యాయి.

మిషన్ భగీరథ స్పెషల్ డ్రైవ్‌లో మూడో దశ త్వరలో ప్రారంభం

special drive on mission bhageeratha:స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అక్కడక్కడా ఉన్న ఇబ్బందులపై కూడా దృష్టి సారిస్తున్నారు. మోటార్లు, పంప్ హౌజ్‌ల పనితీరు, పైప్‌లైన్ల వ్యవస్థ లాంటి వాటిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా నల్లాల సదుపాయం లేకపోతే వారికి కూడా కనెక్షన్ ఇస్తున్నారు. మిషన్ భగీరథ నీటి ప్రయోజనాలపై ప్రజలకు మరో దఫా అవగాహన కల్పించేందుకు కూడా సిద్ధమయ్యారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని ఆవాసాల్లో అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


Gajwel segment: గజ్వేల్ సెగ్మెంట్‌లోని ఆవాసాలకు మంచినీరు సరఫరా కోసం మల్లన్నసాగర్ నుంచి జలాలను తీసుకునేలా పనులను చేపట్టారు. 1212 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మంచినీటి కోసం జలమండలి ఎల్లంపల్లి నుంచి తరలించే గోదావరి జలాలను ఇప్పటి వరకు గజ్వేల్ సెగ్మెంట్ కోసం వినియోగిస్తున్నారు. ఆ స్థానంలో మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకునేలా పనులను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఇటీవల క్షేత్రస్థాయిలో పనుల పురోగతి సమీక్షించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.


ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details