తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడిలోనే ఎలుగుబంటిని బంధించిన గ్రామస్థులు - సిద్దిపేట జిల్లా వార్తలు

సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. గుడిలో ప్రవేశించడాన్ని గమనించిన గ్రామస్థులు... దానిని అక్కడే బంధించారు. అటవీ శాఖకు సమాచారం అందించగా.. వారు దానికి మత్తు మందు ఇచ్చి తీసుకెళ్లారు.

The forest department caught the bear at siddipet district
గుడిలోనే ఎలుగుబంటిని బంధించిన గ్రామస్థులు

By

Published : Aug 1, 2020, 7:33 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలోని పోచమ్మ గుడిలో నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎలుగు ప్రవేశించడాన్ని గమనించిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది గుడిగేట్లను మూసివేసి.. ఎలుగుబంటిని అందులోనే నిర్బంధించారు.

భక్తులు మొక్కులు చెల్లించుకునే గుడిలో... కొబ్బరి కాయల చిప్పలను తినడానికి అప్పుడప్పుడు ఎలుగు బంటి వస్తూ పోతుందని గ్రామస్థులు తెలిపారు. రాత్రి నుంచి ఉదయం వరకు ఎలుగుబంటిని గుడిలోనే నిర్బంధించారు. ఉదయం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు రెస్క్యూ సిబ్బందిని రప్పించి ఎలుగు బంటికి.. ఇంజక్షన్ ద్వారా మత్తు మందు ఇచ్చి బంధించారు. అనంతరం వరంగల్ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details