తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. యువకుడు దుర్మరణం - సిద్దిపేట జిల్లా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ వద్ద సిద్దిపేట-వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఘటనలో బైక్​పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. యువకుడు దుర్మరణం
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. యువకుడు దుర్మరణం

By

Published : Aug 1, 2020, 10:14 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ వద్ద సిద్దిపేట-వరంగల్ ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. వాహనంపై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడిని వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పున్నం తిరుపతిగా పోలీసులు గుర్తించారు. హుస్నాబాద్​లోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది

గారాల కుమారుడు తిరుపతి...

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకుని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఆర్టీసీ డ్రైవర్​గా పని చేస్తుండగా, ముగ్గురు కుమారుల్లో గారాబంగా చూసుకుంటున్న చిన్న కుమారుడు తిరుపతి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చూడండి :కరోనాతో వ్యక్తి మృతి.. రాత్రంతా ఇంటి ముందే ఉన్న మృతదేహం

ABOUT THE AUTHOR

...view details