ఈ ఐదేళ్లలో అభివృద్ధి పరంగా సిద్దిపేట పురపాలక సంఘం.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజా భాగస్వామ్యం, మున్సిపల్ కౌన్సిలర్ల కృషితో రోల్ మోడల్‌గా నిలిచామని చెప్పారు. సిద్దిపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు అధ్యక్షతన 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.154 కోట్ల 43 లక్షలతో రూపొందించిన బడ్జెట్‌కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పారిశుద్ధ్య, ఇతర కార్మికుల వేతనాన్ని 30 శాతం పెంచుతూ ప్రతిపాదించిన తీర్మానం.. అలాగే సిద్దిపేట పట్టణంలో తడి, పొడి, హానికరమైన చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దిన డా.శాంతిని అభినందిస్తూ ప్రతిపాదించిన తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది.
ఎన్నో అభివృద్ధి పనులు..