పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్‌లో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన సంద సత్యం ఆరు ఎకరాల్లో వ్యవసాయ చేస్తుండేవాడు. భార్య, ఇద్దరు కూతుర్లతో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు.
సొంత భూమి లేకపోవడం వల్లే..
సొంత భూమి లేకపోవడం వల్ల పొలం కౌలుకు తీసుకుని పెట్టుబడి సమకూర్చుకున్నాడు. ఈ క్రమంలో పంట సాగు చేయగా నష్టాలనే మిగిల్చింది. చేసిన అప్పులు తీర్చలేక కుటుంబాన్ని పోషించలేక కౌలు రైతు సత్యం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
చందాలతోనే అంత్యక్రియలు !
అంత్యక్రియలకు డబ్బులు కూడా లేకపోవడం మూలానా గ్రామంలోని ప్రజలంతా చందాలు వేసుకుని గ్రామంలోని కుంటలో దహన సంస్కారాలు నిర్వహించారు. సత్యం మృతితో అతని భార్య ఇద్దరు కూతుర్లు.. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయారు.