తెలంగాణ

telangana

ETV Bharat / state

NABARD Chairman: 'తెలంగాణకు ఇచ్చిన రుణం సద్వినియోగం'

NABARD Chairman: రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ జలాశయాల నిర్మాణం అద్భుతమని నాబార్డు ఛైర్మన్ చింతల గోవింద రాజు ప్రశంసించారు. సిద్దిపేట జిల్లాలోని రెండు జలాశయాలను ఆయన పరిశీలించారు. నాబార్డు సభ్యులతో కలిసి గోవిందరాజు మల్లన్నసాగర్‌ను గగనవీక్షణం చేశారు. సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రుణం సద్వినియోగం అయిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

NABARD Chairman, NABARD Chairman govindarajulu, నాబార్డ్ ఛైర్మన్, నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులు
నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులు

By

Published : Dec 3, 2021, 11:42 AM IST

NABARD Chairman: సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రుణం సద్వినియోగం అయిందని నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వల్పకాలంలో మల్లన్నసాగర్‌ను పూర్తి చేశారని ప్రశంసించారు. నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ యడ్ల కృష్ణారావుతో కలిసి గురువారం ఆయన హెలికాప్టర్‌లో వెళ్లి లక్ష్మి పంప్‌హౌస్‌, మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ జలాశయాలను సందర్శించారు.

NABARD Chairman Govindarajulu : మల్లన్నసాగర్‌ ఆకృతి, నిర్మాణం, ఇటీవల మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసిన విషయాలను కాళేశ్వరం ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) హరిరామ్‌, ఈఎన్‌సీ జనరల్‌ మురళీధర్‌లు వారికి వివరించారు. అనంతరం రంగనాయకసాగర్‌ కట్టపై నిర్మించిన నీటిపారుదల ఎస్‌ఈ కార్యాలయం, అతిథి గృహం, సొరంగ మార్గంలోని పంపుహౌస్‌, సర్జ్‌పూల్‌ను నాబార్డు ఉన్నతాధికారులు పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నృసింహ జలాశయాన్ని (బస్వాపురం) ఏరియల్‌ సర్వే ద్వారా వీక్షించారు. రైతులకు ఎంతో మేలు చేసేలా ప్రాజెక్టులు నిర్మించారని నాబార్డు ఛైర్మన్‌ ప్రశంసించారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details