Etela Rajender on KCR: తెరాస ప్రభుత్వం 2023 డిసెంబర్ తర్వాత అధికారంలో ఉండదని... హుజూరాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద గుడాటిపల్లి గ్రామ భూనిర్వాసితుల దీక్షా శిబిరాన్ని... ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఈటల డిమాండ్ చేశారు.
2023 వరకే తెరాస అధికారంలో ఉంటుంది. ఈ రెండు సంవత్సరాలే కేసీఆర్ పాలించేది. ఆ తర్వాత రాష్ట్రంలో తెరాస గెలవదు. ప్రాజెక్టు కోసం సర్వం వదులుకున్న గుడాటిపల్లి రైతులు, ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోం. న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న వారిపై లాఠీఛార్జి భావ్యం కాదు. వారికి ప్రభుత్వం పూర్తి స్థాయి పరిహారం అందించాలి.
-ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
Etela Rajender at gouravelli project: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు కల్పించాలని ఈటల డిమాండ్ చేశారు. ముంపునకు గురవుతున్న గ్రామాలకు చెందిన వారిలో 18 సంవత్సరాలు నిండిన యువకులకు రూ. 8 లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. భూ నిర్వాసితులైన రైతులకు వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశారు. గుడాటిపల్లి ప్రజలు న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తే వారిపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఈటల ఖండించారు. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం అందే వరకు భాజపా తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ రెండేళ్లే.. ఆ తర్వాత తెరాస అధికారంలో ఉండదు: ఈటల ఇదీ చదవండి:Covid Guidelines: 'రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధం'